ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక,…
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. లోకేష్ కి ట్విట్టర్ ఒకటి తేరగా దొరికింది.. ఏదంటే అది ట్వీట్ చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. లోకేష్ మంత్రి ఎలా అయ్యాడు…? అని ప్రశ్నించారు. ఆ రోజు మంత్రి పదవి పీకేస్తే పీతల సుజాత బోరు బోరున విలపించారన్న ఆయన.. మరి అప్పుడు ఇదే మాట తండ్రికి ఎందుకు చెప్పలేదు? మీ హయాంలో బొజ్జల,…
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి సజ్జల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చేంత వరకు పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. మానవతా దృష్టితో ఆలోచించి వైఎస్ఆర్ తెచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ అన్నారు. పిల్లలకు మంచి చదువులు,…
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు.. అయితే, ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. గతంలో విజయవాడలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రభుత్వం పటిష్ట చర్యలకు సిద్ధం అవుతోంది.. ఇక, నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం సమీక్ష నిర్వహించారు.. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడకు…
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు.
వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.. 2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరమన్న ఆయన.. దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది.. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నాం అన్నారు.
నేడు రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి బయలదేరనున్నారు. ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి దిల్లీకి బయలుదేరనున్నారు. ఇవాళ ఆదివారం రాత్రి 9.15 గంటలకు దిల్లీ చేరుకుని, జన్పథ్-1లో రాత్రి బస చేయనున్నారు. ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయన చర్చించనున్నారు. దాంతోపాటుగా.. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఏపీకి…