ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.మంగళవారం కూడా సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇవాళ సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాత్రికి జన్‌పథ్ నివాసంలో సీఎం వైఎస్ జగన్ బస చేయనున్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు సీఎం వైయస్ జగన్ హాజరుకానున్నారు. ఎల్లుండి 10.30-5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు. ఉదయం వినుకొండ పర్యటనలో పాల్గొని అక్కడినించి తాడేపల్లికి చేరుకుంటారు జగన్.
Read Also: Monday Siva Pooja Bhakthi Tv Special Live: సోమవారం ఈ పూజలు చేస్తే శివుడు ప్రసన్నం అవుతాడు
ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అపాయింట్‌మెంట్లు ఇంకా ఖరారుకాలేదు. కాగా 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఉంది.
Read Also: Botsa Satyanarayana : అచ్చెన్నాయుడు అలా మాట్లాడటం దురదృష్టకరం