FREE TABS to Students: రేపటి పౌరుల నేటి అవసరం ట్యాబ్‌లు.. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తుంది సర్కార్.. ఇక, తన పుట్టిన రోజునాడే ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన సీఎం.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. నా పుట్టినరోజున నాకు ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం ఇంత అద్భుతమైన చేయగలుగుతున్నాను.. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.. మన కంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుంటాం.. కానీ, నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు తల్లి తండ్రులు పడుతున్న బాధలు చూశాను.. చదువుతోనే తలరాత మారుతుంది.. ఈ మూడున్నర ఏళ్ళల్లో పిల్లలు అందరూ బాగా చదవాలని దృష్టి పెట్టాం.. కీలక మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు.
Read Also: Minister Harish Rao: మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వారివి పార్టిషన్ పాలిటిక్స్
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
ప్రతి ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్ళల్లోని 8వ తరగతి విద్యార్థుల చేతుల్లో డిజిటల్ ట్యాబ్‌లు పెట్టగలిగాం.. తరాలు మారుతున్న కొన్ని వర్గాల తలరాతలు మారకూడదన్నది పెత్తందారీ స్వభావం.. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య అందకూడదని పెత్తందారీ భావాలు ఆరాటపడటం చూసి బాధ వేసింది.. అందుకే ఆ పెత్తందారీ భావాలను బద్దలు కొడుతూ నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. ఇతర దేశాల్లో తలసరి ఆదాయాన్ని, దేశీయ తలసరి ఆదాయాన్ని పోల్చి లెక్కలు చెప్పిన ముఖ్యమంత్రి.. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే దేశీయ తలసరి ఆదాయం ఎంత తక్కువగా ఉందో వివరించారు.. ఒకవైపు ముఖ్యమంత్రి ఉపన్యాసం కొనసాగుతుండగానే సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు విద్యార్థులు.. ఇక, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య వల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు సీఎం.. నేను మీ మనిషిగా, మీ బిడ్డగా, మీలో ఒకడిగా ఉన్నాను…. తోడుగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. డిజిటల్ డివైడ్ వంటి పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాక్షించారు.. నా పుట్టినరోజు గురించి కాదు ఇవాళ పుడుతున్న పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు.. మేనమామగా బాధ్యత తీసుకున్నాను గనుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని స్పష్టం చేశారు.
ట్యాబ్‌ల పంపిణీ నా పుట్టినరోజుకు మాత్రమే పరిమితం కాదు.. ఇక నుంచి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం జగన్.. ఇవి బహుళ భాషా ట్యాబ్‌లు.. తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ పాఠాలు ఉంటాయని తెలిపారు.. రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబ్‌లుగా పేర్కొన్న ఆయన.. అందరికీ సమాన నైపుణ్యాలు ఉండకపోవచ్చు.. కానీ, ఎదగటానికి సమాన అవకాశాలు ఉండాలి అన్నారు. తరగతిలో టీచర్ చెప్పే బోధనకు ట్యాబ్‌లు మరింత ఉపయోగపడతాయన్నారు. సెక్యూర్డ్ డిజిటల్ కార్డులు ఈ ట్యాబ్ లలో ఉన్నాయి.. నెట్ వర్క్ లేకపోయినా ఆఫ్ లైన్ లో ట్యాబ్ ఉపయోగించుకోవచ్చు అన్నారు.. వీటికి మూడేళ్ల వారంటీ ఉంటుంది.. సమస్యలు వస్తే దగ్గరలోని సచివాలయంలో రిపేర్ చేయటానికి ఇవ్వొచ్చు అని సూచించారు. ఈ ట్యాబ్‌లలో సెక్యూర్డ్ డివైజ్ మొబైల్ సాఫ్ట్వేర్ పెట్టాం.. దీని వల్ల పిల్లలకు నష్టం కలిగించే అంశాలు రాకుండా చర్యలు తీసుకున్నాం.. ట్యాబ్ లు దుర్వినియోగం కాకూడదనే ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 6 నుంచి పై తరగతులు అన్నీ ఇక నుంచి డిజిటల్ క్లాసులుగా మారనున్నాయి.. ఇంటరాక్టివ్ ప్యాలెన్స్ ఏర్పాటు చేస్తున్నాం.. నాడు నేడు తొలి దశ పూర్తి అయిన 15,715 స్కూళ్లల్లో డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటు చేస్తున్నాం.. వచ్చే జూన్ లో స్కూళ్ళు తెరిచే నాటికి డిజిటల్ క్లాస్ లు సిద్ధం అవుతాయన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!