ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఏపీఎస్ఆర్టీసీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మారుమూల ప్రాంతాలతో పాటు దూరప్రాంతాలకు లగ్జరీ బస్సుల్ని అందుబాటులోకి తెస్తోంది. కడప జిల్లా పులివెందుల ప్రజల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం పులివెందులకు రెండు డాల్ఫిన్ లగ్జరీ బస్సులను కేటాయించింది. ఈ బస్సులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పులివెందుల నుంచి విజయవాడ, హైదరాబాద్ పట్టణాలకు డాల్ఫిన్ లగ్జరీ బస్సులను ప్రారంభించి బస్సు ఎక్కి సీటింగ్, ఎసీ చూసి బస్సు వివరాలను ఆర్టీసీ ఆర్ ఎం గోపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
Read Also: Peddireddy RamachandraReddy: చంద్రబాబు బంట్రోతు పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల క్షేమంకోసం జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ఉందన్నారు. అందులో భాగంగా పులివెందుల నుంచి దూర ప్రాంతాలైన విశాఖపట్నం, హైదరాబాద్ పట్టణాలకు ప్రయాణం సులభతరం చేయాలన్న సంకల్పంతో డాల్ఫిన్ లగ్జరీ బస్సులను పులివెందులకు కేటాయించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా ప్రజలు సురక్షితంగా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. పులివెందుల మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్, ప్రజా ప్రతినిధులు కలిసి సీఎం వైఎస్ జగన్ కు విన్నవించగా అడిగిన వెంటనే బస్సులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇందుకు సీఎం కు ధన్యవాదాలు తెలుపుతున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.
Read Also: Shraddha Walkar Case: 5 కత్తులతో శ్రద్ధా బాడీ ముక్కలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు