Nagababu: వైసీపీ, ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నాగబాబు.. మీ తాత, అయ్యా ఇచ్చారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu:ఏపీలోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ)పై ఓ రేంట్‌లో ఫైర్ అయ్యారు మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ప్యాకేజీ మీ అమ్మమొగుడిచ్చారా..? అని కొడాలి స్టైల్‌లో అడుగుతున్నానన్నారు.. కానీ, అలా అనను.. సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే మాకు ప్యాకేజీ అవసరమా..? అని ప్రశ్నించారు. మీ లాగా లక్షలాది, కోట్లాది రూపాయలు మావద్ద లేవు.. మాకున్న కొద్ది పాటి డబ్బుని, రిసోర్స్ ను అందరికీ పంచుతున్నామని వెల్లడించారు.. ప్యాకేజీ అంటూ బావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ తాత, అయ్యా మాకు ప్యాకేజీ ఇచ్చారా? అని నిలదీశారు.. మేం అన్ని కులాలను గౌరవిస్తాం.. మాకు కుల పిచ్చి లేదని స్పష్టం చేశారు నాగబాబు.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఇక, రేపటి యువశక్తి సభ ఎక్స్ లెంట్‌గా ఉంటుంది అన్నారు నాగబాబు.. భయం లేకుండా యువత మాట్లాడేవిధంగా ప్లాట్ పాం ఏర్పాటు చేశాం.. యువత ఆలోచనలు, కోరికలు, రాష్ర్ట అభివృద్ధికి ఇచ్చే సూచనలు తీసుకుంటాం అన్నారు.. యువతను దిశా నిర్దేశం చేయటానికి మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి.. రేపు పవన్ ప్రకటిస్తారని వెల్లడించారు. మరోవైపు రాంగోపాల్‌వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.. రాంగోపాల్ వర్మ పెద్ద వెదవ.. సన్నాసి.. నీచ్ కమీన్ కుత్తె.. అలాంటి వారి గురించి నేను మాట్లాడబోను అన్నారు.. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని ఫైర్ అయ్యారు.. నేను కాపు కులంలో పుట్టాను.. కాపు కులంతో పాటు అన్ని కులాలను గౌరవిస్తాను.. కానీ, కులపిచ్చి లేదన్నారు.. ఒక కులం గురించి మాట్లాడడం తప్పు అని హితవుపలికిన ఆయన.. కాపులకు ఆత్మాభిమానం లేదా..? అని ప్రశ్నించారు.. అసలు ఏ కులమైనా ఎందుకు అమ్ముడు పోతుంది.. అందరికీ ఆత్మాభిమానం ఉంటుందిగా? అన్నారు. ఎన్టీఆర్‌ని, చంద్రబాబుని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, మళ్లీ చంద్రబాబును.. ఇప్పుడు సోకాల్డ్ అడ్డగాడిదలను కూడా గెలిపించింది కాపులే అని తెలిపారు.. అసలు కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు మాకు ఎక్కడుందని నిలదీశారు నాగబాబు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!