రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ లో శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దివ్య నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు. చనిపోయిన యువతి ఎవరో తేల్చే లేకపోతున్నారు పోలీసులు. కాగా.. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తేనే హంతకుల్ని పట్టుకునే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. యువతి వయసు 20 సంవత్సరాల లోపు ఉంటుందని అంచనా వేస్తుండగా.. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది. కాగా.. మొబైల్ ఫోను పూర్తిగా…
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.
అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది.
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది.
గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్ఐ రవితేజపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన కాంప్లైంట్ లో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపింది.