మెట్రలో రైలులో ఓ పెద్దాయన రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. ఆడ పిల్లలపై ప్రతాపం చూపించాడు. మెట్రో రైలు అంటేనే రద్దీగా ఉంటుంది. పైగా ఎవరి స్థానాలు వారికి ఉంటాయి. లేడీస్ సీట్లు, వృద్ధుల సీట్లు వేర్వేరుగా ఉంటాయి. ఒక బెంచ్‌లో మహిళలంతా కూర్చున్నారు. అయితే ఒక వృద్ధుడు వచ్చి వారి ప్రక్కన కూర్చునే ప్రయత్నం చేశాడు. ఖాళీ సీటు ఉన్నా.. ఓ యువతిని లేపి కూర్చునే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే అతడు రెచ్చిపోయి దాడి చేశారు. ఈ ఘటన చైనా మెట్రోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Sudha Murthy : రాజ్యసభలో సుధామూర్తి మొదటి ప్రసంగం..బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ వేయాలని సూచన
బీజింగ్ సబ్‌వేలైన్ 10లో ఈ ఘటన వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు సీటు ఇవ్వాల్సిందిగా యువతిని అడిగాడు. అయితే తన సీటును వెరొకరికి ఇస్తాను కానీ.. అతనికి మాత్రం ఇవ్వనని యువతి చెప్పింది. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు ఆమెపై అరవడం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీదకు వచ్చి ఆయన చేతిలోని, కర్రతో యువతిని ఇబ్బంది పెట్టాడు. తన చేతులతోనే ఆమె భుజం మీద కొట్టాడు. అక్కడితో ఆగకుండా పోలీసులకు కాల్ చేయండి. నిన్ను వేధిస్తున్నానని చెప్పు. .. నాకేం భయం లేదు అంటూ వీడియోలో కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 24 న జరిగినట్లు తెలిపారు.
https://twitter.com/githii/status/1805990026204819875