కొన్ని ప్రమాదాలు తెలియకుండా జరుగుతుంటాయి.. ఇంకొన్ని సార్లు అనుకోకుండా జరుగుతుంటాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దలు జాగ్రత్తలు చెబుతుంటారు. జాగ్రత్తగా వెళ్లి రావాలని చెబుతుంటారు. కానీ కొందరు పెడచెవిన పెడుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
చాలా మంది రైల్లో ప్రయాణం చేసేటప్పుడు డోర్‌ల దగ్గర స్టైల్‌గా నిలబడుతుంటారు. ఇంకొందురు స్టంట్‌లు చేస్తుంటారు. మరికొందరైతే రన్నింగ్‌లో ఉండగానే దిగేస్తుంటారు. ఇలా ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ యువతి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.
రన్నింగ్ ట్రైన్‌లో ఓ యువతి డోరు వద్ద కూర్చుని ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె రైలు నుంచి దిగే ప్రయత్నం చేసింది. రైలు వేగంగా వెళ్తున్న సమయంలోనే దిగాలని ప్రయత్నించింది. డోరు దగ్గర ఉన్న మెట్లపై కాలు పెట్టి నిలబడింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు చూస్తూ ఉన్నా.. ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. పైగా వీడియోలు తీస్తూ వేడుక చూశారు. మెట్లపై నిలబడ్డ యువతి.. కొద్ది సేపటి తర్వాత సడన్‌గా నేల పైకి జంప్ చేసింది. దీంతో అదుపు తప్పి కింద పడింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
the idiot is more keen on shooting it …
not stopping her! 😩 pic.twitter.com/IYtHHcNoiN— JΛYΣƧΉ (@baldwhiner) February 8, 2024