Atrocious: ఉద్యోగం పేరుతో ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్. హైదరాబాద్ లోని అమీర్ పేట్ మధురానగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అమీర్ పేట్ మధురానగర్ లో ఉంటున్న ఓ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉండటంతో అప్లై చేసింది. దీంతో ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. దీంతో ఆనందంతో తన కష్టాలు తీరబోతున్నాయి అని మధురానగర్ లోని ఆఫీసుకు వెళ్లింది. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్ సెలెక్ట్ అయ్యావని జాబ్ లో జాయిన్ కావాలంటే దానికి తన సిమ్ కార్డు కాకుండా.. ఆఫీస్ సిమ్ కార్డు అవసరమని తెలిపాడు. అతని ఆమాటల్లో కాస్త అనుమానం కూడా కనిపించను ఆ యువతి సరే అనింది. ఆ యువతిని మాటల్లో పెట్టి తన గురించి కూపీ లేగేందుకు ప్రయత్నించాడు. సరే రేపు తన ఇంటికి రావాలని నేను బిజీగా ఉంటానని ఆయువతితో సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్ నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన యువతి సరే అంది.
Read also: Actor Bramhaji :ఛీ ఛీ… బూతు పురాణాలు.. వాంతులయ్యేలా ఉన్నాయి..
ఆఫీసు సిమ్ కార్డ్ ఇచ్చే సాకుతో సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్ ఆ యువతిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన యువతిని లోపలికి రావాలని కోరాడు. లోపలికి ఆ యువతి రాగానే డోర్ లాక్ చేశాడు. ఆ యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన మేనేజర్. దీంతో ఆమె కేకలు వేసింది. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఈవిషయం ఎవరికి చెప్పకూడదని తెలిపాడు. తనతో సహకరిస్తే.. మంచి జాబ్ తో పాటు మంచి సాలరీకూడా ఇస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఆయువతి మేనేజర్ వద్దనుంచి చాకచక్యంగా బయటపడింది. మేనేజర్ వద్ద నుంచి నేరుగా మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నవీన్ కుమార్ ను అరెస్టు చేశారు. నవీన్ పై ఆరా తీస్తున్నారు. ఇంతకు ముందే నవీన్ యువతులపై ఇలాంటి దారుణానికి ఓడిగట్టాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగ యువతులు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇంటికి రావాలని కోరితే ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Kaikaluru: దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు స్వాతి ఇంటింటి ప్రచారం