21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Rakul Preet Singh on world yoga day: నేడు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తోపాటు ప్రజలందరూ యోగాసనాలు వేశారు. ఇందులో భాగం గానే తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగ చేసింది. కఠినమైన ఆసనాలు వేసి మెప్పించింది. చాలామంది సినీ అభిమానులకి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. రకుల్…
యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు.
యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. సాధారణ మనుషులకు.. యోగా చేసే వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి రోజు యోగా చేసే వాళ్లు ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రతిపాదించారు.
ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రతీ ఏటా జూన్ 21న యోగా ప్రాధాన్యతను తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజల్లో దాని పట్ల అవగాహన పెంచుతున్నారు. ఈసారి మోదీ కర్ణాటకలోని…
* ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. *అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ * విజయవాడలో ఆయుష్ విభాగము ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ. *అంతర్జాతీయ యోగాదినోత్సవ సందర్బంగా తిరుపతి ప్రకాశం పార్కులో స్దానికులతో కలిసి యోగా చేయనున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి *నేటి నుంచి తిరుపతిలో మూడు…
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 21 (రేపు)న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఉపరాష్ట్రపతి సోమవారం సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి పీఎన్‌టీ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, బేగంపేట్ ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లై ఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ద్వారా రోడ్ నెంబర్ 29లోని నివాసానికి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 6.20…