Rakul Preet Singh on world yoga day: నేడు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తోపాటు ప్రజలందరూ యోగాసనాలు వేశారు. ఇందులో భాగం గానే తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన భర్త జాకీ భగ్నానీతో కలిసి యోగ చేసింది. కఠినమైన ఆసనాలు వేసి మెప్పించింది. చాలామంది సినీ అభిమానులకి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రతిరోజు యోగ తోపాటు జిమ్ లో వర్కౌట్ చేస్తుంది.
Rain season: పిల్లల పట్ల పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
కులం ఆవిడ మాత్రమే ఫిట్ గా ఉండడమే కాకుండా అందరూ ఫిట్ గా ఉండేందుకు పలు ప్రముఖ నగరాలలో ఫిట్నెస్ సెంటర్లను కూడా రన్ చేస్తుంది. ప్రతిరోజు రకరకాల యోగాసనాలు, వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తుంది.
AP News: ఏపీ గవర్నర్ సెక్రటరీగా హరి జవహర్ లాల్.. ఆర్టీసీ ఎండీగా డీజీపీకి అదనపు బాధ్యతలు
తాను ఫిట్ గా ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని ఆమె బలంగా నమ్ముతుంది. ఇక నేడు ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన భర్త జాకీ భగ్నానీతో కలిసి చేసిన యోగాసనాలు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.