యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. సాధారణ మనుషులకు.. యోగా చేసే వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి రోజు యోగా చేసే వాళ్లు ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువ కాలం కూడా జీవిస్తారని చెబుతుంటారు. శాస్త్రీయంగా కూడా ఇది నిజమని నిరూపిస్తుంటారు. ఇదంతా ఎందుకంటారా? తాజాగా ప్రధాని మోడీ గురువారం విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు చేయనున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. శక్తి కోసం ప్రతి ఒక్కరూ తడసానా సాధన చేయాలని మోడీ ప్రజలను కోరారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో వీడియో విడుదల చేశారు. ఆయా భంగిమల్లో కలిగే లాభాలను కూడా క్లియర్‌గా వివరించారు. పలు రకాలైన రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని.. ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు.
తడసానా లేదా తాటి చెట్టు భంగిమ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆరోగ్య ప్రయోజనాలు, నిలబడి ఆసనం చేయడంలోని దశలను వివరించారు. ఇక తడసానా శరీరానికి చాలా మంచిదని.. ఇది మరింత బలాన్ని మరియు మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
Tadasana is very good for the body. It will ensure more strength and better alignment. pic.twitter.com/6i5rp6CbXD
— Narendra Modi (@narendramodi) June 13, 2024