టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నాకు చాలెంజ్ చేసారు.. మత్స్యకారులకు, ఉత్తరాంధ్రాకు ఏం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు నీకు దమ్ము, సిగ్గు లజ్జా ఉంటే.. మీ నాన్న కొబ్బరికాయ కొట్టిన పోర్టు, హార్పర్ ఇది అని చూపించు అని చాలెంజ్ చేశారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు.
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ అధిష్టానంతో నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్నినానితో సీఎం చర్చించారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు మాధవ్ కు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.. మరోవైపు సీఎం…
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాసేపటి క్రితం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. అంబటి రాయుడును పార్టీలోకి సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే అంబటి రాయుడు గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగినప్పటికీ.. అధికారికంగా మాత్రం అంబటి రాయుడు పార్టీలో చేరలేదు.…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరుకాలేదు. మంగళగిరిలోని సెక్రటేరియట్ నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జనవరి నెలలో అమలు చేసే పథకాలకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దాడిశెట్టి రాజాతో సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు డుమ్మా కొట్టారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉంది.. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.
కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోంది అని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అబండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలి అని పురంధేశ్వరి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ లో కేవలం కమ్మ వాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నావు.. కమ్మవాళ్లల్లో కూడా కేవలం నీ చెంచా చంద్రబాబునే కోరుకుంటావు.. మద్యపానం నిషేధిస్తే పెద్ద పెద్ద ఫోటోస్ వేసి రాశావు.. మళ్లీ మద్యపానం కావాలని ఇన్కమ్ కోసం ఉండాలని నువ్వే రాశావు అని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గతంలో 29 ఎస్సీ నియోజకవర్గాలకు 28 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది..