తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో చంద్రబాబు కేసులు వేశారని అన్నారు.
PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి
ఎస్సీలలో నా మేనత్తలు, మేనమామలు ఉన్నారని చెప్పుకునే గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. చట్టాలకు దగ్గర చేయాలని, చదువులకు దగ్గర చేయాలన్న ఆలోచనతో ఎస్సీలకు హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే.. ఏడు చోట్ల డిపాజిట్లు కోల్పోయారని విమర్శించారు. తెలంగాణలో ఒక దళిత బిడ్డకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకు రాలేదు.. ఇలాంటి వాళ్లు అందరూ కలిసి జగన్ ను ఓడిస్తారంట అని దుయ్యబట్టారు.
PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి
పొలాలు తగలబెట్టారన్న అక్రమ కేసులో చంద్రబాబు తనను జైల్లో కూర్చోబెడితే.. జగన్ తనను బయటకు తీసుకువచ్చి పార్లమెంట్ లో కూర్చోబెట్టారని ఎంపీ చెప్పారు. చంద్రబాబుకు లోకేష్ కు భయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు అని పేర్కొన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ ని తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డిని మీరేం చేయలేరని తెలిపారు. ఈ దేశంలో జగన్ ను భయపెట్టే మగాడు పుట్టలేదు.. జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదు, అసలు జగన్ ను చూస్తే మీరు తట్టుకోలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రేమకు జగన్మోహన్ రెడ్డి బానిసలాగా పనిచేస్తున్నారని ఎంపీ సురేష్ తెలిపారు.