Minister Kakani: చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు చెబుతున్నారు.. ఆయన తల పని చేస్తోందో లేదో.. అర్థం కావడం లేదని విమర్శించారు. ఏమి ఆలోచన చేసి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని దుయ్యబట్టారు. కుప్పం ప్రాంతంలో పండించే కూరగాయలను కార్గో విమానాశ్రయం ఏర్పాటు చేసి విదేశాలకు పంపిస్తానని చెప్పాడు.. నాకు వదిలేయండి అని నేను చూసుకుంటానని చెబుతున్నాడన్నారు మంత్రి కాకాణి. ఎన్నికల వరకే ఆయన చూసుకుంటానంటాడు.. ఆ తర్వాత వదిలేస్తాడని పేర్కొ్న్నారు.
Read Also: Chandrababu: వైసీపీకి పెయింటింగ్స్ మీద ఉండే అభిమానం ప్రజలు మీదా లేదు..
మరోవైపు.. సోమిరెడ్డిని సర్వేపల్లి ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఆయన తీరులో మార్పు రావట్లేదని మంత్రి కాకాణి అన్నారు. సీఎం జగన్ పట్ల ఆకర్షితులై యువత వైసీపీలో భారీగా చేరుతోంది.. జగన్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి జగన్ ను సీఎం చేసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే.. ముత్తుకూరు మండల కేంద్రంలో 200 మంది యువకులు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మంత్రి కాకాణి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Read Also: Traffic Restrictions: విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు..