వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు ద్రోహి జగన్ రెడ్డికి వంత పాడేందుకు శేషు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కాపులకు ఏం చేశారో అడపా శేషు సమాధానం చెప్పగలడా? అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ప్రశ్నించలేని స్థితిలో అడపా శేషు ఉన్నాడని ఆరోపించారు. ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు..? అని ప్రశ్నించారు. ఎంత మందికి విదేశీ విద్య ఇచ్చారో అడపా శేషు చెప్పగలరా అని బోండా ఉమ వ్యాఖ్యానించారు.
Balakrishna: అల్లుడితో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ
కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు జగన్ రెడ్డి రద్దు చేస్తే ప్రశ్నించరెందుకు? అని బోండా ఉమ మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజంపేట పార్లమెంటు.. కాంగ్రెస్, టీడీపీ బలిజలకిచ్చింది అని అన్నారు. జగన్ రెడ్డి బలిజలకు మొండి చేయి చూపి.. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి ఇచ్చారన్నారు. పులివెందుల పంచాయతీ సర్పంచ్‌గా బలిజలుంటే.. దాన్ని జగన్ ఫ్యామిలీ కబ్జా చేసిందని ఆరోపించారు. బలిజలకు చెందిన కడప, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో జగన్ రెడ్డి వర్గంతో నింపుకున్నారని తెలిపారు.
#90’s Trailer: శివాజీ హీరోగా 90’s బయోపిక్ సిరీస్.. ట్రైలర్ అదిరిందిగా!
తిరుపతిలో చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. భూమన కరుణాకర రెడ్డితో దాడి చేయించారని బోండా ఉమ అన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా తెలుగుదేశం బలిజలకు ఇవ్వగా.. జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టారని పేర్కొన్నారు. బత్యాల చెంగల్రాయుడు అన్నను వై.ఎస్.రాజారెడ్డి హత్య చేయించాడని ఆరోపించారు. రాయలసీమలో బలిజల విద్యా సంస్థలపై జగన్ రెడ్డి దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నారాయణపై అక్రమ కేసులు పెట్టించారు.. వీటిపై సమాధానం చెప్పే ధైర్యం అడపా శేషుకి ఉందా అని బోండా ఉమ ప్రశ్నించారు.