గుంటూరు జిల్లా తాడికొండలో సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. తనకు గతంలో తాడికొండలో పోటీ చేయమని అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని.. తాడికొండ అభ్యర్థి నువ్వే అని సీఎం కూడా చెప్పారన్నారు. తనకు సంబంధం లేకుండానే సమన్వయకర్తగా నియమించారని తెలిపారు.
Read Also: Minister Kakani: జగన్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి..
కానీ సర్వేలు బాగోలేదని తనను పక్కన పెట్టేశారని డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తాను అడగని సీటుకు తనను సమన్వయకర్తను వేసి మళ్లీ పక్కన పెట్టేశారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు సుచరితను ఇక్కడ ఇంఛార్జిగా నియమించారు.. తనకు రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆశ లేదు, కానీ ఒక్కసారి జగన్ ను చూడాలన్న కోరిక ఉందని తెలిపారు. ఇక్కడ ఉన్న పెద్దలు తనకు జగన్ కలిసే అవకాశం కల్పించండని ఆయన కోరారు.
Read Also: Chandrababu: వైసీపీకి పెయింటింగ్స్ మీద ఉండే అభిమానం ప్రజలు మీదా లేదు..