MLA Koneti Adimulam: తీవ్ర అసంతృప్తిలో సత్యవేడు ఎమ్మెల్యే.. మంత్రిపై గరం గరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. తనకు తెలియకుండా సత్యవేడు నేతలతో సమావేశం పెట్టడం, కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే నగరి తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టాగలరా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రిజర్వడ్ నియోజకవర్గాలంటే అంతా చిన్నచూపా అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే సీనియర్ లీడర్ తానని.. తనలా సర్పంచ్ గా గెలిచాడా.. ఎంపీటీసీ, ఎంపీపీగా చేశానని తెలిపారు. ఎంతోమంది సీఎంలను చూశానని ఆదిమూలం పేర్కొన్నారు.
Read Also: Bihar Politics: నితీష్ వైఖరిపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
పెద్దిరెడ్డి కుట్రలు చేసి తనకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపాదించుకుంది మీరు…దోచుకుంది మీరు.. ఇప్పుడు నిందలు నాపై వేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. నన్ను ఎందుకు ఎమ్మెల్యే నుండి ఎంపీగా పంపిస్తున్నారని జగన్ ను ప్రశ్నించానన్నారు. ఇసుక, గ్రావెల్ దోచుకుంటున్న దొంగలే నాపై దొంగ రిపోర్టు ఇచ్చారని సీఎం జగన్ కే చెప్పానన్నారు. నిజాలు చెప్పాక రెండు నెలలుగా తనను మానసికంగా హింసించారని తెలిపారు. సత్యవేడు ప్రజలు తనతోనే ఉన్నారని చెప్పుకోచ్చారు ఆదిమూలం. కాగా.. ఆదిమూలం ఆరోపణలు జిల్లా వైసీపీలో సంచలనంగా మారింది.
Read Also: Minister Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!