ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు.
ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు పరామర్శించారు. Also Read:…
కడప ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ x వేదికగా స్పందించారు. 'లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం,…
లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారని సజ్జల ఆరోపించారు.
నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా…
మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి.. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు.
వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు.
RK Roja Warns Youtube Channel Owners running on Her name: ఒకప్పటి సినీ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ ఆర్కే రోజా తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, వెంటనే, నా పేరు పై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ…