Vijayasai Reddy: వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం..
- విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభ
- పాల్గొన్న వైసీపీ నేత విజయ సాయి రెడ్డి
- ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోంది
- వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారు- విజయసాయి రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు. ఈ బిల్లును క్యాబినెట్‌లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం ఏ మంత్రి విబేధించినా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సి ఉంటుంది.. కానీ ఈ బిల్లుని రామ్మోహన్ నాయుడు ఆమోదించారని విజయసాయి రెడ్డి తెలిపారు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపీ వ్యతిరేకించింది.. వైసీపీ తరఫున తాము డీసెంట్ నోట్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలపడే ఉంటుందని తెలిపారు.
Guruprasad: అప్పులబాధతో స్టార్ డైరెక్టర్ సూసైడ్.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో.. ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది.. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైసీపి వ్యతిరేకమన్నారు. అలాగే.. రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది.. ఆ భూముల్లో చాలాభాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పని చెప్పారు. కుట్ర పూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు.. ఈ ఆరోపణలను వైసీపి ఖండిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. వక్ఫ్ బోర్డు భూములే 50% ఆక్రమణలకు గురయ్యాయి.. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.
Black Magic: ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..
ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు.. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని విజయసాయి అన్నారు. ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని.. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు, ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయమన్నారు. అలాగే.. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు.. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే తాము సహించమని.. జగన్ ఆదేశాలతో తాము ముస్లింల హక్కుల కోసం పోరాడతామని తెలిపారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!