విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని ఆరోపించారు. ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు అన్నారు.
వైసీపీలో ఒంగోలు వార్ మొదలైందా? జిల్లా అధ్యక్ష పదవి విషయంలో స్థానిక నేతలు గరం గరంగా ఉన్నారా? మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే… ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అధిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారా? ఇంతకీ ఒంగోలులో ఏం జరుగుతోంది? స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నది ఎవర్ని? జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ ముసురుకుంటున్న ముసలం ఏంటి? ఏపీలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ స్దానాలే…
రాజ్యసభలో ఎన్డీఏకు బలం తగ్గిపోయింది. బిల్లులు ఆమోదం పొందాలంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో.. ఎన్డీఏ సంఖ్య 101కి పడిపోయింది.
కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై పలువురు నేతలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.
ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు తీసుకెళతాం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎంవైఎస్ జగన్ తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళుతున్నాడని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని కూడా స్కాంలలో వదల్లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలీదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 71వ జయంతి కార్యక్రమం జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి బీజేపీ…
MLA Gorantla Butchaiah Chowdary on Villages Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల, స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయాల రూపకల్పనకు ప్రభుత్వ నడుం బిగిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నిధులు లేమితో వీధిలైట్లు, పైపులైన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇక నుంచి ఆ పరిస్థితులు…
మేము ఓడినా ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థను కుడా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దైంది. ఈనెల 21, 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నన్నారు.