Narsipatnam Politics : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగించి తీరుతానని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపద్యంలో నర్సీపట్నం టౌన్ మొత్తం పోలీసు దిగ్బంధంలో వుంది. నియోజకవర్గం నలువైపుల నుంచి నర్సీపట్నం వైపు వచ్చే మార్గాలను పోలీసులు పికెటింగ్ పెట్టారు. సాధారణ ప్రజలు తప్ప రాజకీయ నాయకులను, వాహనాలను టౌన్ లోకి అనుమతించడం లేదు.
CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం
ఇటీవల గబ్బాడ ఇసుక డిపో కేంద్రంగా నర్సీపట్నం రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఉన్న ఇసుక నిల్వలను అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తరలించుకుపోయారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ దీటుగా ఎదుర్కోవడంతో స్పీకర్ అయ్యన్న, మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ వర్గాల మధ్య ఫైట్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పోలీసులను టార్గెట్ చేయడంతో ఇసుక వివాదం కొత్తమలుపు తిరిగింది. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తే వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతియుత ర్యాలీ పేరుతో ఆయన చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Israel PM: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన నిర్ణయం..