తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్టైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు…
గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు…
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారని, ఉపాధ్యాయులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని మంత్రి లోకేశ్ చెప్ప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రసంగించారు. ‘ఎన్నికలకు రెండు నెలల ముందు గత…
నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు నివారించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం మొదటి ప్రాధాన్యత పోలవరం అని, రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అని తెలిపారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి.. 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి.. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏపీ…
కొంతకాలం తన లేఖలకు గ్యాప్ ఇచ్చిన వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అందులో ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా? అని ప్రశ్నించారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.…
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని వైఎస్ జగన్ అడిగారు.
సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్ లో పోస్ట్ పెట్టడంతోనే నా పైనా కేసు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 54 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఇక, మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు దోచుకుంటున్నాడు అని మాజీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.