Goutham Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట!
- సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట
- షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు
- దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని సుప్రీం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది. మిగతా షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గౌతమ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.
సత్యనారాయణపురంకు చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తనపై హత్యాయత్నం జరిగిందని సత్యనారాయణపురం ఠాణాలో గతేడాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి సహా 9 మందిని నిందితులుగా గుర్తించారు. రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు.. కుట్ర చేశారన్న గౌతమ్ రెడ్డిని విచారించాలి కదా? అని కోర్టు ప్రశ్నించింది.
Also Read
- TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
తాజావార్తలు
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..