విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం అని మంత్రి కోలుసు పార్థ సారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్లాంట్‌ను కేంద్రం వదులుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి కోలుసు గుర్తుచేశారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గాలికి వదిలేసారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకంకి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణం అని మంత్రి పేర్కొన్నారు.
Also Read: BJP President: బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవం.. స్పందించిన పురందేశ్వరి!
మంత్రి కోలుసు పార్థ సారథి మాట్లాడుతూ… ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఉత్తరాంధ్ర ప్రజలు, టీడీపీ, జనసేన, ప్లాంట్ కార్మికులు సుదీర్ఘ పోరాటం చేశారు. ప్లాంట్‌ను కేంద్రం వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి లోకేష్ గతంలోనే నిర్ణయించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేకపోయారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసింది. సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఢిల్లీ పర్యటనలు చేశారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు వేల కోట్లు నిధులు సాధించారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకంకి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణం’ అని చెప్పారు.