జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం..…
ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి జకియా ఖానం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం.. కొద్ది గంటల్లోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పార్థ సారధి పాల్గొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం జకియా ఖానం మాట్లాడుతూ… ‘ప్రధాని న్రరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా అందరినీ…
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను…
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ దాడిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈరోజు ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి.. మురళీ స్వగ్రామం కల్లితండాకు చేరుకొని వీరజవాన్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించారు. మురళీ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని మాజీ సీఎం చెప్పారు. Also Read: Liquor…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి.. 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాలను పరామర్శిస్తారు. Also Read: Janasena: సైన్యానికి దైవ…
వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి…
ఈరోజు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్‌కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో.. అవిశ్వాస తీర్మానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి.. టీడీపీలో ఉన్న కౌన్సిలర్‌కు వైస్…
తప్పకుండా అధికారంలోకి వస్తాం అని, అందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం (కూటమి ప్రభుత్వం) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాకముందు మన పథకాల ద్వారా పేదల…
మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారని.. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా…