వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకొచ్చారు. వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ముందుగా కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం ఉదయం కంకిపాడు నుంచి గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. Also Read: Kandula Durgesh: ఏరోజూ సినిమా నిర్మాతల్ని…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. క్వార్ట్జ్ అక్రమ…
గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకలో నెల్లూరు పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కాకాణిని నెల్లూరులోని డీటీసీకి పోలీసులు తీసుకొచ్చారు. రేపు వెంకటగిరి మేజిస్టేట్ ముందు కాకాణిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీసుస్టేషన్లో గత ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదైంది. వైసీపీ…
తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని ఇరికించడం దారుణమన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే…
వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వంపెట్టినవన్నీ అక్రమ కేసులే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్…
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ ఎక్స్‌లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగిందని ట్వీట్ చేసింది. మీటింగ్ తర్వాత…
వైసీపీ నేతలు లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ఉన్న మద్యం పాలసీనే అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది తన ప్రభుత్వమే అని, వైసీపీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారని ఎద్దేవా చేశారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్.. ఇలా అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే అని మాజీ సీఎం వైఎస్…
కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని మండిపడ్డారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ నగర…
మాజీ సీఎం వైఎస్ జగన్ పథకాల్ని నిలిపేసి ప్రజలపై కక్ష కట్టొద్దని వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ వ్యాన్ల ద్వారా సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్స్ వ్యవస్థను నిలిపివేశారని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఫాలో…
బోరుగడ్డ అనిల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్‌ను తరలించారు. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును బెదిరించిన కేసులో అనిల్‌కు రిమాండ్ పడింది. Also Read: AP Cabinet Meeting: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు..…