వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకొచ్చారు. వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ముందుగా కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం ఉదయం కంకిపాడు నుంచి గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు.
Also Read: Kandula Durgesh: ఏరోజూ సినిమా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!
వల్లభనేని వంశీ ఆరోగ్యపరిస్థితి తెలుసుకునేందుకు ఆయన భార్య పంకజశ్రీ గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. వంశీని కలిసేందుకు పంకజశ్రీకి పోలీసులు అనుమతించలేదు. వైద్యం జరుగుతుందని, కలిసేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో పోలీసులతో వంశీ భార్య వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ ఎంట్రన్స్ గేటు వద్దే వంశీ భార్య ఉన్నారు. పోలీసుల అనుమతి కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.