Ambati Rambabu: టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?
- టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం
- పిన్నెల్లిపైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు
- పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని ఇరికించడం దారుణమన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీకి జేబు సంస్థగా పని చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ‘నిన్న పల్నాడులో దురదృష్టకరమైన ఘటన జరిగింది. తెలంగాణలో ఓ వివాహానికి హాజరైన తిరిగి వస్తున్న గుండ్లపాడుకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. ఆధిపత్య పోరుతోనే హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారు. రెండు వర్గాల ఆధిపత్య పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి అంటకట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉంది. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారు. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ఇరికించడం దారుణం. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి సోదరులపైన పోలీసులు కేసు నమోదు చేశారు’ అని అన్నారు.
Also Read
Also Read: HHVM : నైజాంలో వీరమల్లుకు భారీ డిమాండ్..!
‘తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలు కూడా టీడీపీలో ఆధిపత్యం కోసమే డబల్ మర్డర్ జరిగినాయి అని వార్తలు రాశారు. తెలుగుదేశం నాయకుల హత్యలకు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం. డెడ్ బాడీలు దొరికితే వైసీపీ నాయకులపైన పోలీసులు హత్య కేసులు నమోదు చేస్తారని నేను మొదటి నుంచి చెప్తున్నా. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవలే హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసు నమోదు చేసి, కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని సీఎం చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారు. గురజాల డీఎస్పీ జగదీష్ నీతి నిజాయితీలతో పని చేస్తే.. మేము చెప్పిన మాట వినలేదని ట్రాన్స్‌ఫర్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీకి జేబు సంస్థగా పని చేస్తున్నారు. అక్రమ కేసులు నమోదు చేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!