మా ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేస్తామో తూచ తప్పకుండా చేసిన పార్టీ వైసీపీ అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మ్యానిఫెస్టోను పక్కాగా అమలుచేసిన రాజకీయ పార్టీగా దేశంలోనే ప్రఖ్యాతి పొందింది. చాలా మంది పథకాల పై అవగాహన లేకుండా హేళన చేస్తున్నారు. విద్య కోసం మేం పెడుతున్న పెట్టుబడి లాభాల కోసం కాదు. రాష్ట్రంలో నిరక్షరాస్యత తొలగించి … చక్కటి విద్యను అందించడమే మా లక్ష్యం. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను…
మైదుకూరు నియోజకవర్గంలో పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు…రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. నియెజకవర్గంలోని టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చట్ట పరమైన చర్యలకు వెళ్తున్నాం అని తెలిపిన ఆయన డిఎస్పీ, సిఐ, ఎస్సైల అక్రమాలపై కోర్టులో కేసులు వేశాం అని…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక…
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేసింది ఏపీ హోంశాఖ. సామినేని ఉదయభాను నిందితుడిగా ఉన్న 10 క్రిమినల్ కేసుల్ని ఎత్తేసింది రాష్ట్ర హోంశాఖ. డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు కేసులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్. 10 కేసులపై ప్రస్తుతం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో కొనసాగుతున్న విచారణ… ఆ పది కేసుల్లో విచారణను ఉపసంహరించుకుంటూ పిటిషన్ దాఖలు చేయించేందుకు చర్యలకు…
వైసీపీకి చెందిన దళిత కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేశారు. అరాచకాలు చేస్తోన్న బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది చంద్రబాబు పాలన కాదు జగన్ పాలన అనేది గుర్తుంచుకోవాలి. అరాచకం చేసిన బీసీ జనార్దన్ రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం సబబా..? చంద్రబాబుకు చెంచాడు సిగ్గు లేదు.. చారెడు ఎగ్గు లేదు అని పేర్కొన్నారు. కోవిడ్ కష్ట కాలంలో చంద్రబాబు హైదరాబాదులో…
ప్రభుత్వాన్నీ అస్థిరపరచడం,బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో లోకేష్ పర్యటనలో కరోనాతో మరణించిన పార్టీ నాయకులు కుటుంబాల పరామర్శ కోసం అని భావించాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్… రాజకీయం మాట్లాడి వెళ్లారు. లోకేష్ కు చరిత్ర తెలియదు… టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల్ని ఊచకోత కోశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు లోకేష్, చంద్రబాబుకి లేదు. టీడీపీ అన్ని వర్గాలను దూరం చేసుకున్నందుకే జగన్మోహన్…
సీఎం జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోలేదు అని బీజేపీ లీడర్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ 35వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను…
ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ. రఘురామరాజు ఒక మానసిక రోగి అని…ఆయనకు ముందు మానసిక వైద్యం చేయించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎం.పీగా గెలిచిన తర్వాత నరసాపురం నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని..దమ్ముంటే ఎం.పీ పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎవరి ప్రోద్భలంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ గారిని, పార్టీ పెద్దలను,…
రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు.రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం…