ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎంపీ లనే చంద్రబాబు బిజెపిలోకి పంపించాడని.. వైసీపీ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడని నిప్పులు చెరిగారు. “సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బిజెపిలోకి పం పించాడు. దానిపై ఒక్క మాట…
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ విజయసాయిరెడ్డి మరోసారి చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరని.. ఈ విషయం రాసి పెట్టుకోవాలని చంద్రబాబుకు గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. “:ఆశలన్నీ చెల్లాచెదురైన తర్వాత తండ్రీ కొడుకుల భాష మారడంలో వింతేమి లేదు. పార్టీ లేదు బొక్కా లేదు అని స్వయంగా పార్టీ అధ్యక్షుడే అన్నాక వీళ్ల సంస్కారహీన వీరంగాలు ఇలాగే ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరు.…
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తిరుపతి ఎంపిగా ఎన్నికైన డాక్టర్ ఎం. గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా డా. గురుమూర్తి మాట్లాడుతూ.. తిరుపతి గెలుపు చాలా ఆనందం ఇచ్చిందని.. ప్రజలందరూ వైసీపీ వైపు ఉన్నారని మరో సారి స్పష్టం అయ్యిందని తిరుపతి ఎంపిగా ఎన్నికైన డా. గురుమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని.. అందుకే ఇంతటి గెలుపు సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ తన…
టిడిపి అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని..చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు నాయుడి, అచ్చెం నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాలడెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని… సంగం డైరీ ఎవడబ్బ సొత్తు…
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం ఉంది. గతంతో పోల్చితే ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ పోలింగ్ జరుగలేదు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తిరుపతిలో చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు కుట్ర పూరితంగా ఆలోచించటానికి అలవాటు పడ్డాడు. దొంగ ఓట్లు వేసేటట్లు అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు వేయరు చంద్రబాబు…
రాప్తాడు నియోజకవర్గంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని పులెటి పల్లి గ్రామంలో నిన్న ఉగాది పండుగ కావడంతో గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవం జరిగింది. ఉత్సవాన్ని తిలకిస్తున్న టిడిపి వర్గీయులు పై వైసీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. గతంలో గ్రామానికి చెందిన చెరువులో చేపలు పట్టే నెపంతో వైసీపీ…
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిశారు తెదేపా ఎంపీలు. చంద్రబాబు సభపై రాళ్ల దాడి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రచార సభపై రాళ్ల దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సరైన చర్యలు తీసుకోవాలని కోరాం. మాజీ ముఖ్యమంత్రి అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించిన సభపై రాళ్ల…
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే.. దేశంలోని ప్రజలంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేవారు.. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించగా… అక్కడున్న వాలంటీర్లు, అభిమానులు కేకలు…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయిన తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని…రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని.. దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రయివేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్…