రాజమండ్రి : వైసీపీ ఎంపీ మార్గాని భరత్… రఘురామ కృష్ణం రాజు కౌంటర్ ఇచ్చారు. రఘురామ కృష్ణం రాజు సైజ్ పెద్దగా అవటంతో.. నేను పిల్లవాడిగా కనిపిస్తున్నానని చురకలు అంటించారు. కృష్ణ జలాల సమస్య, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, రేషన్ పంపిణీకి రాష్ట్రంలో పేదరిక రేఖ 60 శాతమే అని కేంద్రం చెబుతున్న లెక్కల వల్ల అన్యాయం జరుగుతోంది…ఈ అన్ని అంశాలపై పార్లమెంట్ లో తమ గళం వినిపిస్తామన్నారు.
read also : తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
రాష్ట్రంలో పేదరికం ఎక్కువ, తలసరి ఆదాయం తక్కువ అని చెప్పారు. పార్లమెంట్ లో తాను లేవనెత్తిన అంశాలపై స్పీకర్ అభినందించారని… రఘురామ రాజును ఏ రోజైనా స్పీకర్ అభినందించారా? అని ప్రశ్నించారు. ఇచ్చిన గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోతున్నారని… లోక్ సభ స్పీకర్ ను నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోమని అడుగుతున్నామన్నారు.