చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీలో మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి… ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటగా.. ఎంపీపీ ఎన్నికల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యే రోజాకు సెగ తగిలింది.. నిండ్ర మండలం.. ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు చక్రపాణిరెడ్డితో పాటు అతడి తమ్ముడు కూడా మద్దతు ఇవ్వలేదు.. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే రోజా.. స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదన్నారు. ఇక, రెండు వర్గాలుగా ఎంపీటీసీలు విడిపోయారు.. దీంతో నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రికత్తత నెలకొంది..
ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపీపీని చేయాలని ప్రయత్నిస్తుండగా… రోజా ప్రత్యర్థి వర్గం అయిన రెడ్డివారి భాస్కర్ రెడ్డి ఎంపీపీ పదవి కోసం డిమాండ్ చేస్తున్నాడు.. అయితే, నిన్న కోరం లేక ఇవాళ్టికి వాయిదా పడింది ఎంపీపీ ఎన్నిక.. ఈ ఉదయం నుంచి మరోసారి ఎంపీపీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.. అయితే, అధికారులపై, సొంత పార్టీ ప్రత్యర్థి వర్గంపై ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో వాదనకు దిగారు రోజా. టీడీపీ కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవ పడ్డారు ఎమ్మెల్యే రోజా.. దీంతో.. ఉద్రిక్రత పరిస్థితులు నెలకొన్నాయి.