విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులు చేస్తున్న దీక్షకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. కూర్మన్న పాలెంలోని బహిరంగ సభలోపవన్ మాట్లాడారు. నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారన్నారు. నాకు ఒక ఎంపీ కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు పట్టుకెళ్లారు. అయినా ప్రజల సమస్యల కోసం నిలబడేది మేమేనని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ లేఖలు రాసిందని చెబుతుంది.…
ఏపీలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మద్దతు ఇచ్చారు. రైతులు ఇప్పటికే జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. పాలన అంత అమరావతి నుంచే జరగాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే అమరావతి రైతులు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వారు పాదయాత్రను చేపట్టారు. విజయవాడకు వచ్చిన కోదండరాంను అమరావతి రైతులు కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. దీనిపై స్పందించిన కోదండరాం మాట్లాడుతూ… రైతుల ప్రమేయం లేకుండా అమరావతిపై నిర్ణయం…
రైతు భరోసాతో వ్యవసాయం సాఫీగా సాగుతోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయం దండగ అన్న వ్యక్తులే ఇప్పుడు రైతుల పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు, కరువు కవలలు అన్న నానుడి రాష్ట్రంలో ఉందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక వరుసగా మూడు సీజన్లలలో వర్షాలు వచ్చాయన్నారు. రైతు…
అమరావతి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఊహించని షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖను నుంచి నారాయణ స్వామిని తప్పించింది ఏపీ ప్రభుత్వం. ఆ వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో భావించింది ఏపీ ప్రభుత్వం. అయితే అప్పట్లో అభ్యంతరాలు…
ఆ రెబల్ ఎమ్మెల్యే ఊహించింది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటా? పార్టీలో అసమ్మతి కుంపట్లు చెమటలు పట్టిస్తున్నాయా? చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యతిరేకత టెన్షన్ పుట్టిస్తోందా? అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఎక్కడిది? అక్కడ కుమ్ములాటల కథేంటి? బలమైన శక్తిగా ఎదగాలన్నది వాసుపల్లి ఆలోచన? విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో మూడు ముక్కలాట ముదురుతోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా కొత్త కుంపట్లు రాజుకుంటున్నాయి. ఇటీవల అధికారపార్టీ నిర్వహించిన జనాగ్రహదీక్ష సాక్షిగా మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.…
బద్వేలు ఉప ఎన్నికల్లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలువురు నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపలు వస్తున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చటు చేసుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో 103 పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఈసీకి ఫిర్యాదు చేశామని స్థానిక నేతలు తెలిపారు. పలువురు దొంగ ఓటర్ ఐడీలతో వైసీపీ ఓట్లు వేయించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో 58,…
ఆయనో డిప్యూటీ సీఎం. రోజూ జనంతో సంబంధం ఉండే శాఖ ఆయనే చూస్తున్నారు. సీఎం రివ్యూలకూ టంచన్‌గా హాజరయ్యే ఆ మంత్రిగారు సొంత నియోజకవర్గ ప్రజలకు మాత్రం కనిపించడం లేదట. మంత్రి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ అంతా ఆయనే చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు కనిపించడం లేదట. మంత్రి కోసం ఆయన ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఎదురు…
తిరుపతి : చంద్రబాబు కుప్పం పర్యటన పై మండిపడ్డారు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి. అరాచకాలు చేసే సంప్రదాయం వైసీపీకి లేదని..అలాగే తమ అధికారులకు కూడా అలాంటి ప్రవర్తన లేదన్నారు… అమరావతి లో ఏ విధంగా బూతులు తిట్టి, దాడులు చేయించుకుని , ఢిల్లీ వరకు రంకెలు వేసారో.. ప్రజలు గమనిస్తున్నారని చురకలు అంటించారు. ఢిల్లీ వెళ్లి పర్యటన కు వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరారని… కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నాడని మండిపడ్డారు. జలసి,…
బద్వేల్ బై ఎలక్షన్ లో ఉదయం 11 గంటల వరకు 20.89% పోలింగ్ నమోదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ వెల్లడించారు. మాక్ పోలింగ్ సమయం లో ఒకటి రెండు పని ఈవీఎమ్ లు పని చేయకపోతే వెంటనే రిప్లేస్ చేశామని ఆయన ప్రకటించారు. ఎక్కడా ఈవీఎమ్ లు మొరాయించి పోలింగ్ ఆలస్యం అయిన సంఘటన ఎదురవలేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి. ఉదయం 9 గంటల వరకు 10.49% పోలింగ్0 నమోదయ్యిందని..…
అనంతపురం : ప్రశాంత్ కిషోర్ కాదు… వాళ్ల నాన్న.. తాతకు కూడా భయపడేది లేదని… చంద్రబాబు రాజకీయాల్లో నుంచి ఇక తప్పుకోవాలని.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 20 వేల కోట్ల విలువైన మత్తు మందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరని…. ఏ మంత్రులు నోరువిప్పటంలేదని…