అమరావతి : పెట్రోల్ ధరలపై తగ్గించకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.12 తగ్గించాయని… అస్సోం,…
ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలని… దీపావళి పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పవన్…. దీపం పరబ్రహ్మ స్వరూపమని… అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తామన్నారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన అని తెలిపారు. తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ దీపావళి…
దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని…
న్యాయస్థానం నుంచి దేవస్థానం అని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, విజయవాడలోనే ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి ఎందుకు వెళ్లరని టీడీపీని ఉద్దెశించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాయలసీమ వరకు ప్రయాణం చేసి ఏదో విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేయటానికి కుట్రలు చేయడం సరికాదన్నారు. టీడీపీ ముందుండి ఇలాంటి చర్యలకు పూనుకోవటం దుర్మార్గమైన చర్య కాదా అని సజ్జల ప్రశ్నించారు. ఈ పాదయాత్రకు వెళ్తున్న సమయంలో సీమ వాసులు కూడా…
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్ధేశించిన కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాల యంలో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులతో పాటు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైయస్సార్ స్టీల్‌ప్లాంట్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను సీఎం జగన్ సమీక్షించారు. విద్యాకానుకపై సమీక్ష2021–22 విద్యాకానుక కోసం రూ.790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విద్యా…
బద్వేల్ విజయం పై వైసీపీ నేత, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. భారీ మెజార్టీ అందించిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాంత్ రెడ్డి. ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని… ఇది దళితులు విజయం, ప్రతి సామాన్యుడి విజయమని పేర్కొన్నారు. సంప్రదాయాన్ని గౌరవించి పోటీ చేయనని చెప్పిన టీడీపీ దొంగ దారిన బీజేపీకి మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని ఫైర్ అయ్యారు. బీజేపీకి డిపాజిట్ ఎందుకు…
రాష్ట్రఅవతరణ దినోత్సవం రోజున వైఎస్సార్ అవార్డుల కార్యక్రమాన్ని జరపడాన్ని ట్విట్టర్ వేదికగా మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఏ సంబంధం లేని మీ తండ్రి వైఎస్సార్ గారి పేరుపెట్టి ఈ రోజు పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం తప్పని ఇది సరికాదని, మహానీయుడు పొట్టిశ్రీరాములును అవమానించడమేనన్నారు. పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పాణతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అమరజీవికి ఓ దండ వేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. మన రాష్ట్ర…
వాల్టా చట్టం పై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ-సీఈడబ్ల్యుఎ నిబంధనల అమలు పై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సీఈడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును…
ఏపీలో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహాణ ఉంటుంది. 14వ తేదీనే పంచాయతీలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇక 17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్… 18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్ ఉంటుంది. అయితే ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69…
అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది పాదయాత్ర కాదు… రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమం. ఈ మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలి. అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై చూపుతున్న శ్రద్ద రాష్ట్రాభివృద్ది పై…