ఏపీలో ముగిసిన నామినేషన్ల పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
నవంబర్ 14న గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీలకు.. నెల్లూరు కార్పొరేషన్‌కు నవంబర్ 15న.. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్‌పైనే అందరి దృష్టి నెలకొంది. నెల్లూరు కార్పొరేషన్, కుప్పం మున్సిపాలిటీలోని అన్ని స్థానాలను దక్కించుకుంటామనే ధీమాలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.మరోవైపు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. కీలకమైన స్థానాల్లో ముఖ్య నేతలంతా మకాం వేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తమకు అనుకూలంగా ఉన్నవారినే ఆర్వోలుగా పెట్టుకుంటోందని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?