సింహాచలం గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థుల భోజన వసతిసదుపాయాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసు కున్నారు. వసతి భవనం శిథిలావస్థకు చేరుకోవడంపై మంత్రి అధికా రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నిద్రిస్తున్న 300కు పైగా విద్యార్థులను మరొక భవనంలోకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.
స్కూలు భవనం, తరగతి గదులను దేవాలయం లాగా తయారు చేయాలి పాఠశాల సిబ్బందికి సూచించారు. పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవని మంత్రి పాఠశాల సిబ్బంది పై ఫైర్ అయ్యారు. ప్రభు త్వం విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతుందని అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని ఆయన సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు స్వయంగా మంత్రి భోజనం వడ్డించారు.