మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్. ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో…
ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. నవంబర్ 14న…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజీల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుందని, కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదని, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పెట్రోల్పై 5రూపాయలు, డీజీల్పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పన్ను తగ్గించాలని కేంద్రం కోరిందని ఆయన తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను తగ్గిస్తే బీజేపీయేతర రాష్ట్రాల్లో పన్ను తగ్గించ లేద న్నారు. ఏపీలో పెట్రోల్ రేట్లు తగ్గించకపోవడం పై…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఆరోజు ప్రజల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. జడ్పీ లో ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా వైఎస్సార్సీపీ అవడం మాకెంతో ఘనత. వచ్చే పంట రబికి గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటం కారణంగా ఆయకట్ట తగ్గుతుందని రైతుల్లో చర్చ జరుగుతుంది.…
తూర్పుగోదావరి : ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ పరిపాలన నిరంతరాయంగా దశాబ్దాలపాటు సాగాలని… అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం తలమానికంగా మారాలన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే సి.ఎం. జగన్ అమలు చేశారని కొనియాడారు. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని… వరాలు ఇచ్చే దేవుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి అని…
నాకు పదవి రావాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ.. నాకు రాకుంటే మాత్రం పక్కనేతకు రావొద్దని కోరుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. తన సంగతి అటుంచి ప్రత్యర్థికి ప్లస్ అయ్యే అంశాల టార్గెట్గా పావులు కదుపుతున్నారట. పైకి ఇకఇకలు.. పకపకలు.. వెనక మాత్రం వెన్నుపోట్లతో గట్టిగానే చెక్ రాజకీయం నడుపుతున్న ఆ నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అవంతిని మారిస్తే.. ఆయన స్థానంలో కేబినెట్లో ఎవరికి ఛాన్స్? విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో అమాత్య పీఠం కోసం…
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాసవి కన్యాకా పరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాలను దేవాదాయ చట్టం పరిధి నుంచి మినహాయిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు, చౌల్ట్రీలను ఏపీ ధార్మిక హిందూ సంస్థలు, దేవాదాయ చట్టం నుంచి మినహా యిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ఆర్యవైశ్య సంఘాల పరిధిలోనే ఇవి పనిచేస్తాయని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పాలనాపరమైన అంశాల్లో అవకతవకలు…
కేంద్రం తరహాలోనే ఏపీ కూడా పెట్రో ఉత్పత్తులపై తన వాటా వ్యాట్ ను తగ్గించుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ అన్నారు. పెట్రో రేట్లు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం ఏపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తుందా లేదా అన్నారు. కేంద్రం బాటలోనే ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తు ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాయిన్నారు. అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు రూ.7…
విశాఖజిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి కలకలం రేపింది. పాయకరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులు.. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న ఉద్యోగి సత్యన్నారాయణ కారును అడ్డుకున్నారు. ఫీజ్ కట్టి వెళ్లాల్సినదేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇతర సిబ్బంది కూడా అక్కడకు చేరుకోవడంతో మాటమాట పెరిగి చివరకు గొడవకు దారి తీసింది.తమనే అడ్డుకుంటావా అంటూ అధికార పార్టీ…