తూర్పుగోదావరి : ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ పరిపాలన నిరంతరాయంగా దశాబ్దాలపాటు సాగాలని… అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం తలమానికంగా మారాలన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే సి.ఎం. జగన్ అమలు చేశారని కొనియాడారు.
కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని… వరాలు ఇచ్చే దేవుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి అని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు బయటపడేందుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని వెల్లడించారు సజ్జల.