కుటుంబ సభ్యులను కించపరటం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగి స్తున్నాయన్నారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చే స్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమ ర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా ఉందని, ప్రజా సం క్షేమం నాయకులకు పట్టదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం…
ప్రధాని నరేంద్ర మోడీ రైతు చట్టాలను వెనక్కు తీసుకుంటే వెనక డుగు వేసినట్టు కాదని బీజేపీ ఎమ్మెల్సీ, మాధవ్ అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ .. కొందరిని ఒప్పించే ప్రయత్నం బీజేపీ ఏడాదికాలంగా చేస్తూనే ఉందన్నారు. ఆ చట్టాలు లేక పోయినా బయ ట అవి అమల్లోనే ఉన్నాయని, వాటికి కేవలం చట్టబద్ధత కల్పించే ప్రయత్నం మాత్రమే బీజేపీ చేసిందని తెలిపారు. రైతుల మేలు కోస మే ఆ చట్టాలను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని…
ఆ నియోజకవర్గంలో దోచుకున్నవాడికి దోచుకున్నంత.. దాచుకున్నంత..! ఆయనది ఆయనకు ఇచ్చేస్తే.. ఏం జరిగినా అంతా ఆయనే చూసుకుంటారట. ఇప్పటికే ఇసుక.. మట్టి.. సెటిల్మెంట్ల మాఫియాలను ఏర్పాటు చేసి ఎడాపెడా దోచేస్తున్నా ఆశ చావలేదో ఏమో.. ఇంట్లో జరిగిన పెళ్లికి కానుకల రూపంలో అక్షరాల కోటి రూపాయలు వసూలు చేశారట. అధికారపార్టీ నేతలే ఈ బాగోతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అంతా అవాక్కవుతున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నాయకుడు? వైసీపీ నేత ఇంట్లో పెళ్లి.. ఉరంతా కానుకల…
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్మీట్లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో…
టీడీపీ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో భోరున విలపించారు చంద్రబాబు. అనంతరం వైసీపీపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని… రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను హింసించేవారు.. బూతులు తిట్టారు.. అయినా భరించామని.. బీఏసీలో అచ్చెన్నాయుడుతో వ్యంగ్యంగా సీఎం జగన్ మాట్లాడారని ఆగ్రహించారు. అన్నీ భరించి అసెంబ్లీకి వెళ్తే.. నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని… నా భార్య…
ఇవాళ రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా ఒక్క రోజే శాసన సభా సమావేశాలు నిర్వహించాలనుకున్నా… టీడీపీ డిమాండ్కు ఓకే చెప్పి ఈ నెల 26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. మరోవైపు మొదటి రోజు సమావేశాల్లో కుప్పం రిజల్ట్ హాట్ టాపిక్ అయ్యింది.అసెంబ్లీలో తొలిరోజు మహిళా సాధికారత అంశంపై స్వల్ప కాలిక చర్చను చేపట్టారు. పలువురు మహిళా సభ్యులు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా కుప్పం కోర్ టాపిక్గా మారింది.…
ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరుపాలని టీడీపీ డిమాండ్ చేసింది.. కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే.. కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. అసెంబ్లీ…
బాబాయ్ ఒక పార్టీలో ముఖ్య నేత. అబ్బాయి మరొక పార్టీలో యువనేత. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో రాజకీయ క్రీడ మొదలైందా? ఇంతకు ఎవరా అబ్బాయ్.. ఎవరా బాబాయ్? లెట్స్ వాచ్..! భూపేష్రెడ్డే రాజకీయ వారసుడిగా అప్పట్లో ఆదినారాయణరెడ్డి ప్రకటన..! దేవగుడి కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకునేలా కనిపిస్తోంది. ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోనుందా? ఏ రాజకీయం అయితే వారిని కలిపిందో.. అదే రాజకీయం…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి…