రాజధాని అందరికి అందుబాటులో ఉండాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ నాయకులు వంచన మాట లను బయట పెట్టారని ఆయన విమర్శించారు. శ్రీ బాగ్ ఒడంబడికని ఒకసారి చదివి ప్రవేశ పెట్టాలన్నారు. రాయలసీమ అవసరాలు తీర్చా కే ఇతర ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క పని సరిగ్గా చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలని ఆయన ఎద్దేవా చేశారు.
కొత్త బిల్లుకు ఏమైనా అమిత్‌షా ఆమోదం ఉందేమో అన్న అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు. రాయలసీమకి నిధులు, నీళ్లు ఏమై నా వచ్చాయా ఏవిషయంలో అభివృద్ధి చెందిందో జగన్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఓ వైపు వరదల్లో ప్రజ లు కొట్టుకుపోతుంటే సీఎం హెలికాప్టర్‌లో షికార్లు కొడుతున్నారని ఆయన విమర్శించారు. కదిరిలో నాసిరకం బిల్డింగ్ కూలి రెండు కుటుంబాలు చెల్లా చెదురు అయ్యాయని అయినా సీఎంకు సోయి లేదని ఆయన అన్నారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టాలని శైలజానాథ్ అన్నారు.