రాజధాని బిల్లుల ఉపసంహరణపై బాబు స్పందన: సీఎం వైఖరితో రాష్ట్రానికి తీరని నష్టం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని బిల్లుల ఉపసంహరణపై టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ, సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసం హరణ మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్ వైఖరి రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూర్చుతుందని ఆయన ఆరోపించారు.సీఎం జగన్ వైఖరితో రాష్ర్టానికి తీవ్ర నష్టం జరగుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరిచారన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను దెబ్బ తీసేందుకే జగన్ అనాలోచిత చర్యలు చేపడుతున్నారన్నారు. అమరావతి రైతులు ఆందోళన చేస్తుంటే జగన్ ఎద్దేవా చేశారన్నారు. జగన్ పార్టీ, నాయకులు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తామే కరెక్ట్ అంటూ సమర్ధించుకుంటున్నారని రాష్ర్ట ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టిన వారిని కూడా జగన్ పార్టీ నాయకులు విమర్శించారన్నారు.
ఎంతో ముందు చూపుతో అమరావతిని నిర్మించడానికి తలపెడితే జగన్ అంతా మూడు రాజధానుల పేరిట అమరావతిని పక్కకు పెట్టారన్నారు. నేడు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మరో రాజధాని బిల్లుతో వస్తానడంలో ఏం మతలబు ఉందంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ర్ట ప్రజల నిర్ణయాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజధాని బిల్లును వెనక్కు తీసుకోవడంతోనే ఆగిపోమని అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీపోరాటం చేస్తుందని చంద్ర బాబు చెప్పారు. ఇప్పటికైనా జగన్, జగన్‌పార్టీనాయకులు అహంకారం వీడాలన్నారు. ఇన్నేళ్లు రాజధాని నిర్మించకుండా అటు ప్రజలను ఇటు రైతులను జగన్ మోసం చేశారని చంద్రబాబు అన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!