బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర: కనకమేడల రవీంద్రకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిల్లు ఉపసంహరణ వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులను తప్పుదారి పట్టిం చాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే నేడు బిల్లులు వెనక్కు తీసుకు నేలా చేసిందన్నారు. న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందన్న భయంతోనే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఉంపసంహరణ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న దాదాపు 180కు పైగా నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. బిల్లులు విత్ డ్రా చేయడాన్ని స్వాగతిస్తున్నాం..కానీ ఆ నిర్ణయం వెనకున్న మీ దుర్భుద్ధిని ఖండిస్తున్నామని కనక మేడల అన్నారు.
లెజిస్లేచర్ ను పక్కదారి పట్టించి, ప్రజలను మోసంచేయడమేగాక న్యాయస్థానాలను తప్పుదారి పట్టిస్తున్నారని కనకమేడల ఆరోపిం చారు. గతంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నామన్నారు.ఆ ప్రకటనపై ఇప్పటి ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పుడు బిల్లులు ఉపసంహరించుకోవడం వెనుక పాలకులు రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని మండిపడ్డారు. 20-01-2020న ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో డీసెంట్రలైజేషన్ యాక్ట్, సీఆర్డీఏ రిపీల్ బిల్ తీసుకొచ్చారు. ఆయాక్ట్ లో మొదటిది శ్రీకృష్ణ కమిటీని ఉల్లంఘించి, దానిపై ఎక్స్ పర్ట్ కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ వేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిందే ఆయా కమిటీలు నివేదికల రూపంలో ప్రభుత్వం ముందు ఉంచాయి.
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లుల్లో కూడా పాలకులు అదే పంథాను అనుసరించబోతున్నారన్నారు. జగన్‌మోహన్ రెడ్డి కాదు కదా..ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చలేదు.. మొదట్నుంచీ అదేచెబుతున్నాం. పార్లమెంట్లో జరిగిన చర్చలకు భిన్నంగా, రాజ్యాంగంలోని నిర్ణయాలకు విరుద్ధంగా, ఆర్గనైజేషన్ యాక్ట్‌కు భిన్నంగా వ్యవహరించడం ఎవరి వల్ల కాదన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఇప్పటికైనా చెప్పి, తప్పు ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారన్నారు.
తప్పు గ్రహించకుండా కోర్టులను ప్రజలను మోసగించాలని చూడకండి అని జగన్ ఉద్దేశించి అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులకు ఇంకో ముఖ్యమంత్రి అయితే ఎన్నోసార్లు రాజీనామా చేసేవాడు.కానీ వీరికి ఎలాంటి నైతిక విలువలు లేనందున అలా చేయరని ఎద్దేవా చేశారు. రాజధాని లేని అథోగతికి రాష్ట్రాన్ని దిగజార్చారు. అదే గందర గోళాన్ని మరో రెండున్నరేళ్లు కొనసాగించడానికి సిద్ధమయ్యారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!