ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్ మీదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి ఎగరేసుకుని పోయారు. ఈసారి తమకు ప్లేస్మెంట్ ఖాయం అనుకున్న నేతలు నోరెళ్లబెట్టారు. లెక్కలు మనం వేసుకుంటే ఫలితం రాదు.. నాయకుడు వేస్తేనే వస్తాయని సైలెంట్ అయ్యారట. రెండు పేర్లు చివరి నిమిషంలో రేస్‌లోకి వచ్చాయా? ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ కొద్దిరోజులుగా కసరత్తు చేసింది. సామాజికవర్గాల ఈక్వేషన్స్‌లో 50-50 శాతం రేషియో పాటిస్తున్న సీఎం జగన్…
సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని పవన్ ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్య త్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీటిలో ఎన్ని…
విశాఖ:- 2024 నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవుతుందని… ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందని వైసీపీ ఎండీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నాయకులు మాతో టచ్ లో వున్నారు..చర్చలు జరుగుతున్నాయన్నారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేరారు. గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి అహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..…
ఏదో చేయబోయారు.. ఇంకోదో అయ్యింది. వీళ్లను నిలదీయాలనుకున్నారు.. కానీ వాళ్లని నిలదీసే పరిస్థితి తెచ్చారు. ఇంతకీ వీళ్లు చేసింది.. మంచి అయ్యిందా? చెడు చేసిందా? క్రెడిట్ కొట్టేద్దాం అని వాళ్లు అనుకుంటే.. సీన్ రివర్స్ చేసిపెట్టారా? గిల్లి.. గిల్లించుకోవడం అంటే.. ఇదేనంటూ సెటైర్లు పడుతోంది అందుకేనా..? ఉపఎన్నికల ఫలితాలతో తలబొప్పికట్టి నష్టాన్ని గుర్తించిన కేంద్రం..! రోజూ అదేపనిగా పెరిగిన పెట్రో ధరలు వంద దాటిపోయాయి. అయినా ఆగలేదు. జనం గగ్గోలుపెట్టినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా జరిగిన…
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా వారు వైసీపీ పై ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో అధి కార దుర్వినియోగాని పాల్పడుతున్నారని వారు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. కొండపల్లి, కుప్పం, నెల్లూరుల్లో ఎన్నికల ప్రచారంలో వార్డు వలంటీర్లు పాల్గొంటున్నారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు. వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారంటూ…
కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్ ఎస్ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ…
అక్కడ పదవులు ఊరకనే రావ్.. ! ఎన్నో ఫైటింగ్‌లు చేయాలి.. లాబీయింగ్ నడపాలి…! ఆ జిల్లాలో ఇలాంటి తతంగాలు చాలానే ఉంటాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లోనూ అదే సీన్. ఒక పదవి కోసం ముగ్గురు రేస్‌లోకి వచ్చారు. ఆ ముగ్గురిలో ఇద్దరు స్వయాన అన్నదమ్ములు. ఒకరి వ్యూహం ఇంకొకరికి లీక్ కాకుండా పావులు కదపడమే ఆసక్తి కలిగిస్తోంది. ఉరవకొండ నుంచే ముగ్గురు ఉడుంపట్టు..! అనంతపురం జిల్లా రాజకీయాలు రాష్ట్రంలోనే భిన్నం. ఒక్కోసారి పదవుల కోసం ఎలాంటి…
పదవి వచ్చిన మూడు నెలలకే ఆయన మూడ్ ఆఫ్ అయింది. ఛైర్మన్ పోస్ట్ ఉన్నట్టా.. లేనట్టా అని ఒక్కటే అనుమానం. కనీసం కుర్చీ కూడా లేదు. దీంతో లబోదిబోమంటున్నారట ఆ నాయకుడు. ఆయనెవరో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఛైర్మన్ పదవి ఇచ్చారు.. కుర్చీ లేదు..! రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్‌గా వైసీపీ నేత చందన నాగేశ్వర్‌ను నియమించి మూడు నెలలైంది.ఇంతవరకు ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇందుకు కారణం పదవి ఇష్టం లేక కాదు.. పదవి ఇచ్చారు…
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం త్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతుల పాదయాత్ర, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు…
కుప్పం పర్యటనలో నారా లోకేష్ వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని… అడ్డగోలుగా తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతుల పై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని ఫైర్ అయ్యారు.ఖాకీలు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా… ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తమ నాన్న చంద్రబాబు కాస్త సాఫ్ట్ అని.. కానీ తాను…