మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్ రద్దుపై వెనకడుగు: అశోక్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్ రద్దు పై వెనుకడుగు వేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆనాడు మెజార్టీ లేదని కౌన్సిల్ రద్దు చేస్తా మన్న ప్రభుత్వం , ఈనాడు అధికారపార్టీ మోజార్టీ పెరిగిందని మాట తప్పడం సిగ్గు చేటన్నారు.కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వ మేనని తాము గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దుచేయడం, తిరిగి ఏర్పాటుచేయడమనేది రాష్ట్రాల చేతిలో ఉండదు. పెద్దల సభలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాల న్నఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. కేవలం మూడు రాజధాను ల బిల్లుని తిరిగి ఆమోదించుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడుకౌన్సిల్ అవసరమొచ్చిందన్నారు.
ఈ ప్రభుత్వం ఏంచేయాలనుకున్నా 2023 వరకు ఒకరిద్దరు తప్ప, టీడీపీ బలం కౌన్సిల్‌లో అలానే ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసు కునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ ఎప్పటిలాగానే పోరాడు తుంది దీనిలో ఏ మార్పు ఉండబోదని ఆయన తెలిపారు. ప్రభుత్వం వాహ నాలపై పన్నులుపెంచుతూ తీసుకొచ్చిన బిల్లుని టీడీపీ తీవ్రంగా వ్యతి రేకిస్తోందన్నారు.వాహనాలు, పెట్రోల్ డీజిల్ లపై వచ్చే ఆదాయం చాలదన్నట్లు ఈ ప్రభుత్వం ఏటా రూ.500కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే రూ.500 కోట్లతో ప్రభుత్వ దరిద్రం ఏమీ పోదు కదా అంటూ అశోక్ బాబు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Tags
- AP Assembly
- ashok babu
- jagan
- tdp
- ycp
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?