గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ జరుగుతుండగానే వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం కాస్తా మరింత ముదిరి సభలోనే వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ…
బిజినెస్ ముఖ్యమా? పార్టీ ముఖ్యమా? ప్రస్తుతం టీడీపీలో ఇదే చర్చ. కొంతమంది నేతలు బిజినెస్సే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తూ… కుదిరిన సమయంలో మాత్రమే వస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాల కోసమే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా బిజినెస్ పొలిటీషియన్స్? వ్యాపారాల కోసం సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న టీడీపీ నేతలు?ఏపీ టీడీపీలో బిజినెస్ పొలిటీషియన్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోయిన తొలినాళ్లలో టీడీపీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా లేకున్నా.. కొంచెం నిరాశ నిస్పృహల్లో…
వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. కరోనా ఎంట్రీతో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ ఏపీలో సంక్షేమ పథకాలు ఏమాత్రం ఆగలేదంటే ఆ క్రెడిట్ మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. ఇలాంటివి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు సంయమనం కోల్పోయి వైసీపీపై బూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కొద్దిరోజులుగా ఏపీలో…