వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్ధిస్తూన్నారా?…
Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అక్కడ మామ పొలిటికల్ జర్నీకి అల్లుడు మోకాలడ్డుతున్నాడా? లేక అల్లుడికి చెక్ పెట్టేందుకు మామ కామ్‌గా పావులు కదుపుతున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని రెండు పక్షాల అనుచరులు రక్తి కట్టిస్తున్నారా? గత ఎన్నికల్లో అల్లుడి చేతిలో ఓడిన ఆ మామ ఎవరు? ఇద్దరి మధ్య సోషల్ యుద్ధంలో బయటికి వస్తున్న కొత్త విషయాలేంటి? పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు…
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దాంతో వైసీపీకి చెందిన మేయర్ సురేశ్ బాబు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పక్కనే తనకు కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు. ‘హూ ఈజ్ జైశ్రీ’ అంటూ మేయర్ స్టేడియం వద్ద నినాదాలు చేశారు. రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని.. నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు? అని ఎమ్మెల్యే మాధవీ…
కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలని హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నింటిని విడిచి పెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్…
మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో కుర్చీ వివాదంపై కడప నగరం మొత్తంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ‘హూ ఈజ్ జయశ్రీ’, ‘మహిళలు అంటే చిన్న చూపా’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక మహిళ ఎమ్మెల్యేకు గౌరవం లేదా, జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్‌లకు అనుమతి తీసుకొని నాలుగు ఫ్లోర్ కట్టారు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. కార్పోరేషన్ కార్యాలయం…
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపైన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వాయిదా పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్…
ఏపీలో మరో రాజకీయ సంచలనానికి తెరలేవబోతోందా…? ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా…? ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్ళారా? అంతా రెడీ… ఇక గేటు తోసుకుని లోపలికి వెళ్ళడమే మిగిలిందా? అపోజిషన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికారపక్షం అట్నుంచి నరుక్కొస్తోందా? ఆ ఎంపీ సైతం స్వామి భక్తికంటే సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యమని భావిస్తున్నారా? ఎవరాయన? ఏంటా కథ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా? అంటే…. సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందంటున్నారు…