Ambati Rambabu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Sensational Comments On Chandrababu Naidu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించింది మెసఫెస్టో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనని పిలుపునిచ్చారు. తాము గడప గడపకు వెళ్ళి ధైర్యంగా మేనిఫెస్టో ఇస్తున్నామని అన్నారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తను ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఎవరూ చూడకుండా తగలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలపై ప్రజల మధ్య చర్చలు జరగాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసే సమయంలో.. మేనిఫెస్టో గురించి పట్టించుకునే వాళ్లమే కాదని బాంబ్ పేల్చారు. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా భావించి అమలు చేసే గొప్ప సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు.
Botsa Satyanarayana: ఎన్నికలొస్తే.. పగటి వేషాల్లాగా చంద్రబాబు రంగులు మారుస్తాడు
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అంతకుముందు కూడా.. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి అసలు ఏ మేనిఫెస్టో అయినా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని మోసం చేసిన సంగతి జనం మర్చిపోలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి అప్పుడు కూడా మోసం చేయలేదా? అని నిలదీశారు. ఇవ్వాళ ప్రజల నెత్తిన మళ్ళీ వాగ్ధానాల టోపీ పెట్టారన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. ఈసారి రానున్నది కురుక్షేత్ర యుద్దమేనని.. ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని చెప్పారు. పేదలు లేని వ్యవస్థను సృష్టిస్తానని చంద్రబాబు చెప్తున్నారని.. మరి, 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశావా? అని నిలదీశారు. ఖరీదైన రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాజకీయాలను కూడా వ్యాపారం చేశాడని మండిపడ్డారు. సైకిల్ స్క్రాబ్‌గా మారిపోయిందని, తుక్కుతుక్కు అయిన సైకిల్‌ని మళ్ళీ తొక్కాలని చంద్రబాబు తాపత్రయం పడుతున్నారని సెటైర్లు వేశారు.
Supreme Court: ఒడిశా రైలు ప్రమాదంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని పిల్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు