Vasantha Krishna Prasad: దేవినేని ఉమా.. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు, పాలు అమ్మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP MLA Vasantha Krishna Prasad Fires On Devineni Uma: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తాజాగా మాజీమంత్రి దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కంచికచర్లలో కూల్‌డ్రింక్ షాప్ నడిపిన దేవినేని ఉమా.. ఐదుసార్లు ఎలా పోటీ చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తరహాలో పూలు, పాలు అమ్మావా? అని నిలదీశారు. ఇసుక, మట్టి అమ్ముకోవడం తప్ప నువ్వు ఏ వ్యాపారం చేశావో చెప్పు? అని అడిగారు. దేవినేని ఉమా వైసీపీకి అనుకూల శత్రువని, దేవినేని ఉమా లాంటి నాయకుడు ఉండబట్టే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కకావికలం అయ్యిందని ధ్వజమెత్తారు. దేవినేని ఉమా చరిత్ర ఏంటో అందరికీ తెలుసన్న ఆయన.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన మైలవరం ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
farmers Support to Wrestlers: రెజ్లర్లకు మద్ధతుగా రైతుల భారీ సభ
Also Read
- TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
ఒక్కసారి గెలిచిన కృష్ణ ప్రసాద్‌కు అంత బలుపా అని ఉమా మాట్లాడుతున్నారని.. అవును తనకు బలుపేనంటూ వసంత కృష్ణప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు నాలుగు సార్లు గెలిచినా.. నీ గెలుపు ఎటువంటి గెలుపో చెప్పాలని అడిగారు. అన్నా వదినల బలిదానంతో దేవినేని ఉమా గెలిచాడని.. అది గెలుపు కాదని తేల్చి చెప్పారు. 2019లో మంత్రిగా ఉన్న నిన్ను.. 13 వేల ఓట్ల తేడాతో ఓడించానని, అదీ అసలైన గెలుపని ఉద్ఘాటించారు. మంత్రి మల్లారెడ్డిలాగే తాను కూడా ఎంతో కష్టపడి ఎదిగానని చెప్పుకుంటున్న దేవినేని ఉమా.. ఏం వ్యాపారం చేశాడో చెప్పాలని నిలదీశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నాయకులు తెలుగుదేశం పార్టీని వదిలి.. వైసీపీలోకి చేరడానికి కారణం దేవినేని ఉమానే అని ఆరోపించారు. టీడీపీలో ఉన్న క్రియాశీల నాయకులు పని చేయకపోవడానికీ ఆయనే కారణమని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna: అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.. న్యాయం తేలింది
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!