YCP vs TDP: గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సభ జరుగుతుండగానే వైసీపీ, టీడీపీకి చెందిన ఇరుపార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం కాస్తా మరింత ముదిరి సభలోనే వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. ఈ గొడవలో పలువురు కౌన్సిలర్ల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.
Read Also: Merugu Nagarjuna: పార్టీ లైన్ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదు..
ఎంత వారించినా గొడవ సద్దుమణుగకపోవడంతో ఛైర్‌పర్సన్ సభను అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలోని సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిలర్లు ఇలా సభలోనే ఒకరిపై ఒకరు తన్నులాడుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ గొడవకు దిగిన సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ గొడవ అసలు ఎందుకు జరిగింది, ఎలా ప్రారంభమైందనే విషయం తెలియాల్సి ఉంది.